
మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో నాయకులు ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపై జెనీవాలో నాలుగు రోజులుగా జరుగుతున్న సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వ లక్షణాలను ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు వివరించారు. ఈ సదస్సుకు 35 దేశాల ప్రతినిధులు హాజరుకాగా రాష్ట్రం నుంచి జూపూడితోపాటు డాక్టర్ ప్రదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జూపూడి రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్య సాహసాలను, నాయకత్వ లక్షణాలను ఉదహరించారు. ఇటీవల ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వివరిస్తూ అధికార పార్టీలు అవలంబిస్తున్న విధానాలను వెల్లడించారు. ‘వన్ మ్యాన్ కెన్ ఛేంజ్ ది వరల్డ్’ అన్నట్లుగా జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. దళితుల అభివృద్ధికి, పేదరిక నిర్మూలన కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులను తెలియజేసినట్టు జూపూడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment