ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పై మాజీ మంత్రి శంకరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎంగా కిరణ్ కొనసాగితే రాష్ట్రానికి చీకటి రోజులే అన్నారు. ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయకపోతే కాంగ్రెస్ కు చెడ్డపేరు తప్పదని హెచ్చరించారు. నిన్న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన వీరభద్రసింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. సీఎం సహా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా రాజీ నామా చేయాలన్నారు. తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన సలహా ఇచ్చారు. డీజీపీ నియామకంపై క్యాట్ తీర్పును గౌరవించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట ఘటనపై వాస్తవాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అప్పుడే ఎవరెవరికి సంబంధాలున్నాయో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. లక్ష్మీపేట ఘటనపై కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాలన్నారు. ప్రజావసరాలు తెలుసుకుని మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచన చేశారు.

No comments:
Post a Comment