దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేరును ప్రజలు మర్చిపోయేలా చేయడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం.. వైఎస్ పెట్టిన పథకాలు, వాటి పేర్లను ఒక్కొక్కటిగా మార్చేస్తోంది. ఇప్పటికే వైఎస్ పెట్టిన ‘రాజీవ్ యువశక్తి’ పేరును ‘రాజీవ్ యువకిరణాలు’గా మార్చేసింది. తాజాగా మరో కార్యక్రమం పేరునూ మార్చింది. అప్పట్లో వైఎస్ నామకరణం చేసిన ‘సమాచార స్రవంతి’ కార్యక్రమం పేరును ఇప్పుడు ‘ప్రజాహితం’గా మార్చారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిర్వహించిన వివిధ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు వారంలో ఒక రోజు ఒక శాఖకు చెందిన మంత్రి ‘సమాచార వేదిక’ అనే కార్యక్రమం పేరుతో మీడియాతో మాట్లాడేవారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ సర్కారు.. ‘సమాచార స్రవంతి’ పేరుతో వారంలో ఒక రోజు ఒక శాఖ మంత్రి ద్వారా మీడియాతో మాట్లాడే పద్ధతిని ప్రవేశపెట్టింది. వైఎస్సార్ మరణించిన తరువాత ఆ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మరుగున పెట్టింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో పథకాల ప్రచారం లేకే ఓడిపోయామని చెప్పుకుంటున్న సీఎం, మంత్రులు తాజాగా సమాచార స్రవంతి పేరును ‘ప్రజాహితం’గా మార్చారు. ఈ కార్యక్రమం ద్వారా వారంలో ఒక రోజు ఒక శాఖ మంత్రి.. తన శాఖ తీసుకున్న చర్యల వివరాలను మీడియాకు వెల్లడించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రజాహితం ద్వారా తన శాఖ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించనున్నారు. ఇలా వారంలో ఒక శాఖ మంత్రి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించాలని నిర్ణయించారు.

No comments:
Post a Comment