వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ తో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయిందని ఆపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఈరోజు ఉదయం సోనియా గాంధీని కలిశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అరెస్ట్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో మరిన్ని ఓట్లు వచ్చేలా చేసిందన్నారు. ఏదేమైనా జగన్ ను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదని సోనియా అభిప్రాయంగా కనిపించినట్లు పాల్వాయి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో ఎలాంటి మార్పులయినా ఉంటాయని ఆయన అన్నారు. రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం వల్లే విజయం సాధించామని, అది ఏ ఒక్క నాయకుడి క్రెడిట్ కాదని పాల్వాయి వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment