మచిలీపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘పెద్దాయన’ పాట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కంగు తినిపించింది. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రోశయ్యకు కాంగ్రెస్ కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేస్తుండగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ మోగడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ పాటను ఆయన రింగ్ టోన్‌గా పెట్టుకోవడంతో ఒక్కసారిగా ‘పెద్దాయన.. పెద్దాయన.. ఇది స్వార్థపు లోకం.. పెద్దాయనా’ అని పాట వినిపించింది. దీంతో అక్కడివారంతా విస్తుపోయారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గంభీరమైన వాతావరణం ఏర్పడింది. తామూ ఆ పాటను రింగ్‌టోన్‌గా పెట్టుకున్నామని, రింగయ్యింది తమ ఫోనేమో అనుకున్నామని మరికొంతమంది కార్యకర్తలు చెప్పుకోవడం కనిపించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment