హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నుంచి జేఎన్ టీయూ వరకు నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తార్నాకలోని హెచ్ ఎండీఎ కమిషనర్‌కు పార్టీ ఐటీ విభాగం నాయకులు బుధవారం వినతిపత్రం సమర్పించారు.
2005లో మహానేత ప్రారంభించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను ఇప్పటికీ ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుందని వారు విమర్శించారు. అభివృద్ది పనులను నత్తనడకన సాగిస్తున్నారని ఆరోపించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment