సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్‌పై విచారణ జరపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. గుంటూరుకు చెందిన భూషణ్ భవనం అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. 2011 నుంచి జేడీ కాల్‌లిస్ట్, ఎస్‌ఎమ్‌ఎస్‌లపై పూర్తిస్ధాయి విచారణ జరపాలని భూషణ్ హైకోర్టును కోరినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులుగా హోం సెక్రటరీ న్యూఢిల్లీ, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, బీఎస్‌ఎన్‌ఎల్‌ను చేర్చినట్లు భూషణ్ చెప్పారు. సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న తీరును చూసి కలత చెంది ఈ పిల్ దాఖలు చేశానన్నారు. భూషణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment