ఇస్లామాబాద్: సరబ్ జిత్ సింగ్ ఉరిశిక్ష రద్దయింది. పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ సరబ్ జిత్ సింగ్ ఉరిశిక్షని జీవిత ఖైదుగా మార్చారు. దాంతో సింగ్ కొద్ది రోజులలో విడుదల అవుతారు. 20 సంవత్సరాల క్రితం బాంబు దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ సింగ్ ఇక్కడ జైలులో ఉంటున్నాడు. ఉరి శిక్షని జీవిత కాలశిక్షగా మార్చడంతో ఇప్పటికే 14 ఏళ్లు దాటి జైలులో ఉంటున్న అతనిని త్వరలో విడుదల చేస్తారు.
ఇదిలా ఉండగా, ఈ విషయం తెలిసి పంజాబ్ లోని సరబ్ జిత్ సింగ్ కుటుంబ సభ్యులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉండగా, ఈ విషయం తెలిసి పంజాబ్ లోని సరబ్ జిత్ సింగ్ కుటుంబ సభ్యులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.
No comments:
Post a Comment