వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ ఎన్‌టీపీసీ సింహాద్రి విద్యుత్ ప్లాంట్ బాధితులను పరామర్శించేందుకు ఆదివారం విశాఖ వస్తున్నారు. విమానంలో ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఎన్‌టీపీసీ సింహాద్రి ప్లాంట్‌కు సమీపంలోని తిక్కవాని పాలెం వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. ఈ మేరకు ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్‌టీపీసీ వ్యర్ధాలు, బూడిద విసర్జన, పైప్‌లైన్‌ల ఏర్పాటు వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందంటూ గురువారం ఆందోళనకు దిగిన మత్స్యకారులపై సీఐఎస్‌ఎఫ్ పోలీసులు లాఠీఛార్జి, ఫైరింగ్ జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బాధితులను విజయమ్మ తిక్కవానిపాలెంలో కలుసుకుంటారు. అనంతరం గాయపడి విశాఖ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఆమె విశాఖ నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరతారు.

No comments:
Post a Comment