* ఈ ఏడాది తొలి త్రైమాసిక సర్వే ఫలితాలను వెల్లడించిన ఐఆర్‌ఎస్
* మూడు నెలల వ్యవధిలో 1.37 లక్షల మేర పెరిగిన పాఠకుల సంఖ్య..
* ఏటా ‘సాక్షి’కి పెరుగుతున్న పాఠకాదరణ
* 2010 తొలి త్రైమాసికంలో సాక్షి పాఠకుల సంఖ్య 1.29 కోట్లు
* రెండేళ్లలో దాదాపు 14 లక్షల మేర పెరిగిన పాఠకుల సంఖ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగు ప్రజల మనస్సాక్షి ‘సాక్షి’ పత్రిక పాఠకాదరణ దినదిన ప్రవర్థమానమవుతోంది. సాక్షి పాఠకుల సంఖ్య ఏటా పెరుగుతోందని ఇండియన్ రీడర్‌షిప్ సర్వే(ఐఆర్‌ఎస్) గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2012 జనవరి- మార్చి) సర్వే ఫలితాల ప్రకారం.. సాక్షి పాఠకుల సంఖ్య 143.66 లక్షలు(ఒక కోటీ 43 లక్షల 66 వేలు) అని ఐఆర్‌ఎస్ తెలిపింది. ఆరంభం నుంచి ‘సాక్షి’ పాఠకుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది.
2009 రెండో అర్ధ సంవత్సరం(జూలై-డిసెంబర్)లో సాక్షి పాఠకుల సంఖ్య 125.13 లక్షలు కాగా.. 2010 తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో అది 129.84 లక్షలకు పెరిగింది. రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో 132.23 లక్షలకు, మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 133.78 లక్షలకు, నాలుగో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో 134.74 లక్షలకు చేరింది.
2011లోనూ ఇదే పెరుగుదల నమోదైంది. తొలి త్రైమాసికంలో పాఠకుల సంఖ్య 139.39 లక్షలకు పెరగగా.. రెండో త్రైమాసికంలో 139.47 లక్షలు, మూడో త్రైమాసికంలో 141.36 లక్షలు, నాలుగో త్రైమాసికంలో 142.29 లక్షలకు చేరింది. ఇప్పుడు తాజా సర్వేలో 2012 తొలి త్రైమాసికంలో పాఠకుల సంఖ్య 143.66 లక్షలకు పెరిగింది. అంటే 3 నెలల వ్యవధిలో 1.37 లక్షలమేర పాఠకుల సంఖ్య పెరిగిందన్నమాట.

No comments:
Post a Comment