అలాంటి లీకు వీరులపై చర్యలు తీసుకోవచ్చు : సీబీఐ మాజీ డైరెక్టర్ జోగీందర్‌సింగ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ విచారించే కేసుల్లో కొద్దిమంది మీడియా ప్రతినిధులకు ఏరి కోరి లీకులు ఇవ్వడం సంస్థ నిబంధనావళికే పూర్తి విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ జోగీందర్‌సింగ్ స్పష్టం చేశారు. అలా చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. ‘‘సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు విషయంపై ఏదైనా చెప్పాల్సి వస్తే అందరికీ చెప్పాలే తప్ప కమ్యూనిస్టులతోనోలేదా బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతోనో పంచుకోకూడదు. అలా చేయడం సంస్థ నిబంధనలకే విరుద్ధం’’ అని ఆయన పేర్కొన్నారు. పత్రికలకు సమాచారమిచ్చే విషయంలో సీబీఐ అనుసరించాల్సిన నిబంధనలను 1996లో తానే రూపొందించానని జోగిందర్‌సింగ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ అనుమతి లేకుండా కేసుల విషయంలో ఏమీ చెప్పకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ సమాచారం ఇవ్వాల్సి వచ్చినా తప్పనిసరిగా డైరెక్టర్ నియమించిన అధికారి లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా ఆ పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. సీబీఐ పూర్తిగా ప్రభుత్వ జేబు సంస్థగా మారిందన్నారు. ఆ సంస్థ అధికారులు బాత్రూమ్‌కు వెళ్లాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Because the JD/CBI is under the fullest protection of the chair person of UPA; nothing will happen to him and he never stop doing whatever, he likes.
ReplyDelete