హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ‘సాక్షి’ మీడియాపై నమోదు చేసిన కేసు దర్యాప్తును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు గురువారం ప్రారంభించారు. అందులో భాగంగా, దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం లక్ష్మీనారాయణ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరోపక్క ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా కాల్ డీటైల్స్ బయటకు రావడం, ప్రచురణ కావడానికి సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థతో పాటు ‘సాక్షి’ మీడియాకు కూడా సీసీఎస్ నోటీసులు జారీ చేసింది. ‘కాల్ డీటైల్స్ ఎవరిచ్చారు? ఎవరికిచ్చారు? వారి వివరాలేమిటి? పేర్లు, చిరునామాలు ఏమిటి?’ వంటి మొత్తం ఐదారు ప్రశ్నలను అధికారులు సంధించారు. వాటికి లిఖితపూర్వకంగా బదులివ్వాలని కోరారు. కాల్ వివరాలు తీసుకోవడం, ఇవ్వడంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డీఓటీ), టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మార్గదర్శకాలను కూడా సీసీఎస్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు.
Thursday, 28 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment