భూ కబ్జా, చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న టీడీపీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే ఆమె అనుచరులు దుర్గారాజ్, ముజాహిద్‌ఖాన్‌లను అరెస్టు చేసిన పోలీసులు ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారు. ఆమె అరెస్టుకోసం కేపీహెచ్‌బీకాలనీ పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాన్ని సైతం రంగంలోకి దింపారు. ఈ బృందం మూడు రోజులనుంచి ఆదిలాబాద్‌లో మకాం వేసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. అలాగే ఆమె బంధువు ముండె వెంకట్‌రాథోడ్, అనుచరుడు డోంగ్రీ గణేష్, నకిలీ భూ యజమానికోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలోని 400 గజాల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడమేగాక దానిని ఇతరులకు విక్రయించి రూ.1.80 కోట్ల మేరకు సొమ్ము చేసుకున్నట్టు ఎమ్మెల్యే, ఆమె బంధువులు, అనుచరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
sakshi
sakshi





నిర్మల్ (ఆదిలాబాద్), న్యూస్‌లైన్: తెలంగాణ విషయంలో వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో ఉందని పార్టీ సీజీసీ మెంబర్ కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఈనెల 17న చేరుతుండడంతో నిర్మల్‌లో ఆ కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం ఆయన ఇక్కడకు వచ్చారు. పార్టీ ప్రో గ్రాం రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ తదితరులతో కలిసి నిర్మల్‌లోని అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇంట్లో శుక్రవారం మహేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.




సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసి రిటయిరయిన మరో ఐయేయెస్ అధికారి యూఎస్ మిశ్రా కేంద్రీయ దర్యాప్తు సంస్థ -సీబీఐ-పై రాజకీయపరమయిన ఒత్తిళ్లు ఉండే మాట వాస్తవమేనని బహిరంగంగా ఒప్పుకున్నారు. గురువారంనాడు -డిసెంబర్ 13న- సీబీఐ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం గురించి ఓ టెలివిజ్షన్ చానెల్‌లో మాట్లాడుతూ మిశ్రా ఈ విషయం చెప్పారు. మాయావతి ఆస్తుల కేసు దర్యాప్తు సందర్భంగా రాజకీయపరమయిన ఒత్తిడి ఎదుర్కొన్నానని మిశ్రా స్పష్టం చేశారు. వాస్తవానికి సీబీఐపై రాజకీయపరమయిన ఒత్తిడి గురించి మొట్టమొదటిసారి ప్రస్తావించిన ఉన్నతాధికారి మిశ్రా కాదు. మరో రిటైర్డ్ సీబీఐ డెరైక్టర్ జోగీందర్ సింగ్ ఈ విషయాన్ని ఎన్నడో బహిరంగంగా వెల్లడించారు. అంతేకాదు- పాలకుల చేతుల్లో సీబీఐ సామూహిక సంహరణాస్త్రంగా తయారయిందని కూడా గురువారంనాడు అదే టెలివిజ్షన్ చానెల్‌లో మాట్లాడుతూ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. 1996-97 సంవత్సరాల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌పై నమోదయిన పశువుల దాణా కుంభకోణం కేసు విషయంలో తనపై ఆనాటి పాలకులు ఒత్తిడి తెచ్చారని జోగీందర్ సింగ్ వెల్లడించారు. 1977లో ఇందిరా గాంధీని అరెస్ట్ చేసిన సీబీఐ మాజీ జాయింట్ డెరైక్టర్ ఎన్.కే. సింగ్ కూడా సీబీఐ పనిలో అడుగడుగునా రాజకీయ జోక్యం ఎదురయ్యేదని చెప్పడం విశేషం.









