భూ కబ్జా, చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న టీడీపీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే ఆమె అనుచరులు దుర్గారాజ్, ముజాహిద్‌ఖాన్‌లను అరెస్టు చేసిన పోలీసులు ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారు. ఆమె అరెస్టుకోసం కేపీహెచ్‌బీకాలనీ పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాన్ని సైతం రంగంలోకి దింపారు. ఈ బృందం మూడు రోజులనుంచి ఆదిలాబాద్‌లో మకాం వేసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. అలాగే ఆమె బంధువు ముండె వెంకట్‌రాథోడ్, అనుచరుడు డోంగ్రీ గణేష్, నకిలీ భూ యజమానికోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలోని 400 గజాల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడమేగాక దానిని ఇతరులకు విక్రయించి రూ.1.80 కోట్ల మేరకు సొమ్ము చేసుకున్నట్టు ఎమ్మెల్యే, ఆమె బంధువులు, అనుచరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
sakshi
sakshi
No comments:
Post a Comment