మునిసిపల్ ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరులోగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మహీధరరెడ్డి తెలిపారు. 2001 జనాభా లెక్కలను అనుసరించి ఎన్నికలు నిర్వహించడానికి అనుమతించాలని కోరుతూ వారం రోజుల్లోగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఎన్నికలకు తామెప్పుడూ భయపడబోమని అన్నారు. అలా భయపడేవాళ్లమే అయితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు తెచ్చుకునేవాళ్లమే కాదని అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలు సకాలంలో జరపాలని తాము ప్రయత్నించామని, అయితే, గత ఏడాది రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేదని చెప్పారు.
2011 జనాభా లెక్కలతో ఎన్నికలు నిర్వహించాలని భావించామని చెప్పారు. కానీ, తాజా లెక్కల పూర్తి వివరాలు రావడానికి మరో ఎడెనిమిది నెలలు పడుతుందని కేంద్ర జనాభా లెక్కల సేకరణ అధికారులు లేఖ రాశారని, దీంతో పాత జనాభా లెక్కలతోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం యోచిస్తోందన్న ప్రచారం గురించి విలేకరులు మంత్రిని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఉన్నామని అన్నారు.
కార్పొరేషన్‌గా చిత్తూరు!
చిత్తూరు మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖమ్మం మునిసిపాలిటీని కూడా కార్పొరేషన్‌గా మార్చే ప్రక్రియ వేగంగా సాగుతోందని అన్నారు. త్వరలోనే ఈ రెండూ కార్పొరేషన్లుగా మారతాయని చెప్పారు.

No comments:
Post a Comment