ఒక కేసులో దర్యాప్తు ప్రారంభించాక దారి మళ్లించకూడదు
సాక్షి టీవీ చర్చలో సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాసన్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎలాంటి కేసులో అయినా ఒక విషయం మీద దర్యాప్తు ప్రారంభమయ్యాక.. దాన్ని మళ్లించి విభిన్న అంశాలను అందులో చేర్చకూడదని సుప్రీంకోర్టు న్యాయవాది, సీబీఐ మాజీ న్యాయవాది శ్రీనివాసన్ పేర్కొన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్ వ్యవహారంలో సాక్షి జర్నలిస్టుపై కేసులు పెట్టడంపై సాక్షి టీవీలో బుధవారం ప్రసారమైన ప్రైమ్ టైమ్ చర్చా కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ఆయన పాల్గొన్నారు. సీబీఐ గానీ, రాష్ట్ర పోలీసులు గానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) ప్రకారమే దర్యాప్తు చేయాలన్నారు. దర్యాప్తు చేయాల్సిన అంశంపై కాకుండా మిగతా అంశాలను కేసులో చేర్చి దర్యాప్తును పక్కదారి పట్టించకూడదన్నారు. కేసు పక్కదారి పట్టే విధంగా కొత్త విషయాలను దర్యాప్తులో భాగం చేయడం పద్ధతి కాదని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశానికే దర్యాప్తు పరిమితం కావాలన్నారు. ఒక ప్రైవేటు వ్యక్తి కాల్ లిస్ట్‌ను బయటపెట్టిన జర్నలిస్టు మీద అధికార రహస్యాల చట్టం కింద కేసు పెట్టడాన్ని తప్పుబట్టారు. అధికారంతో ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో.. యథాలాపంగా ఈ చట్టం కింద కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ‘కాల్ డేటా, ఈ మెయిళ్లను మార్చేయడానికి అవకాశం ఉన్నందున.. ఈ వ్యవహారంలో అధికార రహస్యాల చట్టం వర్తించే అవకాశం లేదు. పెద్దపెద్ద పెట్టెల్లో డాక్యుమెంట్లు తీసుకురావడం లాంటి భారీ హడావుడి సీబీఐ కేసుల్లో ఉంటుంది. అయితే సక్సెస్ రేటు చాలా తక్కువే’ అని వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment