చంచల్ గూడ జైలు అధికారుల వైఖరిపై వైఎస్ వివేకానందరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన ఆయనను అధికారులు అనుమతించలేదు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడుతూ జైలు అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల తీరు చూస్తుంటే ప్రభుత్వ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు.
కుటుంబ సభ్యులను కూడా అనుమతించకపోవటం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల నుంచి జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. ఒక వ్యక్తిపై ఇంతగా కక్ష సాధించటం సరికాదన్నారు. జగన్ కు ప్రజల ఆశీస్సులున్నాయని వివేకానందరెడ్డి అన్నారు.

No comments:
Post a Comment