రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి రంగం సిద్ధం అవుతోందా..? మార్పులు, చేర్పులు ఖాయమా..? ఢిల్లీలో పరిణామాలు చూస్తుంటే పరిస్థితి అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుసుకున్న తర్వాత రాజకీయ వేడి పెరిగింది. ఇప్పటికే సీఎంని, పీసీసీ అధ్యక్షుడిని పిలిపించుకున్న అధిష్టానం గవర్నర్ నుంచి సవివరమైన నివేదిక తెప్పించుకుంది.
రాష్ట్రంలో జగన్ ప్రభావం, తెలంగాణ అంశం, దిగజారిన పార్టీ పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నుంచి పార్టీ హైకమాండ్‌కు నివేదికలు అందాయి. వీటితోపాటు పార్టీ హైకమాండ్ ఈసారి నేతల్ని ఒక్కొక్కొరుగా పిలిపించుకుంటోంది. గవర్నర్ నరసింహన్‌తోపాటు డీఎల్ రవీంద్రారెడ్డి, పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, మంత్రి పితాని సత్యనారాయణ సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. మరోవైపు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా వారం రోజుల నుంచి హస్తినలోనే మకాం వేశారు.

No comments:
Post a Comment