తిరుపతిని మద్య రహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన దీక్ష నేటితో నాలుగవ రోజుకు చేరుకుంది. కాగా కరుణాకర్ రెడ్డి దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చింది. అంబేద్కర్ సర్కిల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో యాభైమంది కార్యకర్తలతో సహా వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, అజయ్ కుమార్, మణిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment