వాషింగ్టన్: తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చేపట్టిన నిరశన దీక్షకు వాషింగ్టన్ డి.సిలో ఉంటున్న ఎన్నారైలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తిరుమల తరహాలో తిరుపతిలో కూడా సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేసి తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన అవసరం వుందన్నారు. నాలుగో రోజుకు చేరిన భూమన దీక్షకు దేశ, విదేశాల నుంచి వివిధ వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు.
తిరుపతి పవిత్రతను కాపాడేందుకు పాటుపడతానని ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను ఎమ్మెల్యేగా ఎన్నికయిన మరుక్షణమే భూమన నిలుపుకున్నారని ప్రశంసించారు. ఆయన చేపట్టిన దీక్షతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్పందనే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకు తిరుపతిలో మద్యం నిషేధించాలని ఎన్నారైలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్ డి.సి నుంచి వల్లూరు రమేష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

No comments:
Post a Comment