టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, టీడీపీ నేత దాడి వీరభద్రరావులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆడిటర్ విజయ సాయిరెడ్డి మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన చంద్రబాబు, దాడి వీరభద్రరావుతో పాటు అసత్య కథనాలు ప్రచురించిన రామోజీపై కేసులు నమోదు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఐపీసీ 499,500 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయాలని విజయసాయిరెడ్డి తన పిటిషన్‌లో కోరారు. కాగా ఈ వ్యవహారంపై క్షమాపణలు చెప్పాలని జూన్9న జారీ చేసిన లీగల్ నోటీసులకు చంద్రబాబు, రామోజీ, వీరభద్రరావు స్పందించలేదని విజయసాయిరెడ్డి కోర్టుకు తెలిపారు.

No comments:
Post a Comment