దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆత్మ ఘోషించేది కాంగ్రెస్ నాయకుల చర్యల వల్లనేనని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడే మాటలకు వై.ఎస్ ఆత్మ ఘోషిస్తోందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ‘విజయమ్మ మాటలకు వై.ఎస్ ఆత్మఘోషిస్తోందని ఈ నాయకులు అంటున్నారు. రాజశేఖరరెడ్డి మృతికి తట్టుకోలేక మరణించి 700 మంది కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని ఏఐసీసీ ప్రకటించింది. ప్రకటించిన సాయాన్ని ఎందుకు ఇవ్వలేక పోయారు? ఆ కుటుంబాల వారు అడగనిదే లక్ష రూపాయల డబ్బు ఇస్తానని ప్రకటించిన ఏఐసీసీ ఆ తరువాత దానిని అమలు చేయనందుకు వై.ఎస్ ఆత్మ ఘోషించదా! మరణించిన 700 మంది ఆత్మలు ఘోషించవా? వై.ఎస్ హత్యకు గురయ్యేలా తామే చేశామనే అపరాధభావనతో లక్ష రూపాయలు ఇవ్వలేదా?’ అని రాంబాబు నిలదీశారు.
జగన్‌ను జైలుకు పంపి ఇక తమదే రాజ్యమనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామనీ సంతసించిన బొత్స, లగడపాటి వంటి నేతలకు రెండు రోజులగా విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిళ ప్రచారానికి లభిస్తున్న ప్రజాదరణ చూసి మతి పోయిందనీ అందుకే ఏం చేయాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో విజయమ్మ, షర్మిళ పర్యటనకు లభిస్తున్న స్పందన, సభలు విజయవంతం అవుతున్న తీరు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలి పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ అరెస్టుతో భాధల్లో ఉన్న తమకు విజయమ్మకు ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన ఊరటను కలిగిస్తోందని ఆయన అన్నారు.
జగన్‌ను జైలుకు పంపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని జరిగిన కుట్రలను ప్రజలు తిప్పి కొట్టారని ఆయన అన్నారు. విజయమ్మ పర్యటలను కొన్ని మీడియా సంస్థలు తక్కువ చేసి చూపిస్తున్నాయనీ ఇది ప్రజాస్వామ్యంలో ధర్మం కాదని ఆయన అన్నారు. మీడియా, పత్రికలకు ఎవరి ఎజెండా వారికి ఉండవచ్చనీ అందులో త ప్పు కూడా లేదని అయితే వాస్తవిక సంఘటనలను అలాగే చూపించడ మనేది ప్రజాస్వామ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాంగోపాల్‌వర్మను జగన్ బెదిరించినట్లుగా లగడపాటి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదనీ ఆయన అబద్ధాలు చెబుతున్నాడని రాంబాబు అన్నారు. బఫూన్‌లాంటి రాజగోపాల్ కేవలం జగన్‌ను బద్నాం చేసేందుకే ఎన్నికల సమయంలో వర్మను బెదిరించినట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. ‘జగన్, వర్మను బెదిరించి ఉంటే ఆనాడే ఎందుకు చెప్పలేదు, ఇపుడే ఎందుకు బయట పెడుతున్నారు, వర్మ ఎవరికీ భయపడే వ్యక్తి కాదే! సంచలనాలు చేసి సినిమాలు తీసే వ్యక్తి వర్మ గారు, అలాంటి వ్యక్తిని నిజంగా జగన్ బెదిరించి ఉంటే అపుడే ఫిర్యాదు చేసి ఉండొచ్చు. ఇంత కాలం మౌనంగా ఉండి ఇపుడు చెప్పడం అంటే ఇది లగడపాటి వంటి వారు చేస్తున్న కుట్రలో భాగస్వాములు కావాలనుకుంటున్నారేమో!’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లగడపాటి తన ఫాంహౌస్‌లో జరిగిన పేలుళ్లపై కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆపాదించాలని చూశారనీ అయితే సంఘటన జరిగిన కొన్ని గంటలల్లోనే అందుకు కారణం తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులని తేల్చారనీ రాంబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తున్న గుండె గల ఎమ్మెల్యేలు, మనసున్న వారూ జగన్‌కు మద్దతుగా నిలుస్తారనీ ఎంత మంది వస్తారనేది తాను చెప్పలేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

No comments:
Post a Comment