కోటవురట్ల : జగన్ మోహనరెడ్డిని జనం నుంచి విడదీసి తీరాలన్న కాంగ్రెస్, టీడీపీల పన్నాగంలో భాగంగానే సీబీఐ అరెస్ట్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె విశాఖపట్నం జిల్లా కోటవురట్లలో ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. వైఎస్ మరణం ఎలా జరిగిందన్న విషయంలో కూడా ఇదే తరహా రాజకీయం జరిగిందని విజయమ్మ ఆరోపించారు. పెట్టుబడుల కేసులో తొమ్మిది నెలలుగా ఎటువంటి విచారణ జరపని సీబీఐ ఉప ఎన్నికల ముంచుకొచ్చిన తరుణంలో అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అమె సీబీఐని ప్రశ్నించారు. |
Thursday, 31 May 2012
కుట్రలో భాగమే జగన్ అరెస్ట్ : విజయమ్మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment