వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఉప ఎన్నికల ప్రచార పర్యటనలో స్వల్పంగా మార్పు జరిగింది. తొలుత వారిద్దరూ 5వ తేదీన కర్నూలు, 6న అనంతపురం జిల్లాల్లో పర్యటించాలని భావించారు. అయితే ప్రస్తుతం మార్పు చేసిన కార్యక్రమం ప్రకారం 5న ఉదయం అనంతపురం, సాయంత్రం రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, 6న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉదయం, ఆళ్లగడ్డలో సాయంత్రం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారని రాష్ట్ర పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ చెప్పారు.
విజయమ్మ, షర్మిల ఉప ఎన్నికలు జరగని ప్రాంతాల మీదుగా వెళ్లేటపుడు ఆయా ప్రాం తాల ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్వాగత కార్యక్రమాలు వంటివి చేపట్టరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. పర్యటనల మార్గమధ్యంలో వారిని కార్యకర్తలు అభిమానంతో ఆపినా.. ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలుగుతుందని వివరించారు. అందువల్ల ప్రజలు, కార్యకర్తలు వైఎస్ కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలపాలి తప్పితే ఇతర కార్యక్రమాలు చేపట్టొద్దని ఆయన సూచించారు. తమను నమ్ముకుని పదవులు కోల్పోయిన ఎమ్మెల్యేల తరఫున ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యత విజయమ్మపై ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలని రఘురామ్ కోరారు.

No comments:
Post a Comment