రాజకీయ కుట్రలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు జరిగిందని పేర్కొంటూ జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ)లో హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌ను ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. సీబీఐపై చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ‘‘మూడు రోజుల విచారణకు జగన్ పూర్తిగా సహకరించినా, ఆయనను సీబీఐ అక్రమంగా అరెస్టు చేసింది.
ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయకుండా జగన్‌ను అడ్డుకునేందుకే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సీబీఐ ద్వారా అరెస్టు చేయించాయి. దర్యాప్తు పూర్తై, మూడు చార్జిషీట్లు దాఖలైన కేసులో జగన్‌ను అరెస్టు చేయడంపై ప్రజల్లోనే అనేక అనుమానాలున్నాయి. సీబీఐ చర్యలు కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయి’’ అని ఆజాద్ తెలిపారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సీబీఐపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్‌ెహ చ్‌ఆర్సీని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

No comments:
Post a Comment