న్యూస్‌లైన్‌నెట్‌వర్క్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు బుధవారం పలు జిల్లాల్లో రిలే దీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడతో పాటు పలుప్రాంతాల్లో రిలేదీక్షలు చేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేట సెంటర్‌లోని వైఎస్ విగ్రహానికి పాలు, నెయ్యి, జలాభిషేకాలు చేశారు. నల్లగొండలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష చేశారు. మిర్యాలగూడ మండలం అవంతీపురం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం గుట్టపైకి అర్ధనగ్నంగా మోకాళ్లపై మెట్లెక్కి, పూజలు చేశారు. దేవరకొండలో లగడపాటి దిష్టిబొమ్మకు అంతిమ సంస్కారాలు జరిపి, దహనం చేశారు.
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, తవణంపల్లె, బెరైడ్డిపల్లెలో రిలే దీక్షలు జరిగారుు. పశ్చిమగోదావరిజిల్లా భీమవరం, ఉండి నియోజకవర్గ కేంద్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో దీక్షలు జరిగాయి. ఏలూరులో మాజీ మేయర్ తాడిగడప రామారావుతో పాటు మాజీ కార్పొరేటర్లు పలువురు దీక్షలు చేపట్టారు. భీమవరం ప్రాంత సీనియర్ నేత రాయప్రోలు శ్రీనివాసమూర్తితో పాటు వందమంది కార్యకర్తలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సంఘీభావం ప్రకటించారు. కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడులో సోనియా, కిరణ్‌ల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. కరీంనగర్‌లో జరిగిన దీక్షల్లో పార్టీ జిల్లా కన్వీనర్ పుట్ట మధు, వేములవాడలో వైఎస్సార్‌సీపీ నేత ఆది శ్రీనివాస్ పాల్గ్గొన్నారు. సిరిసిల్లలో మౌనప్రదర్శన నిర్వహించారు. ముస్తాబాద్‌లో మహాత్ముని విగ్రహం వద్ద కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేశారు.
విజయనగరం, అనంతపురం జిల్లాల్లో రిలేదీక్షలు, దిష్టిబొమ్మల దహనాలు, శాంతిర్యాలీలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరం నిర్వహించారు. పులివెందులలోని పాతగంగిరెడ్డి ఆస్పత్రి ప్రాంగణంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 300మంది పైగా కార్మికుల, మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వీరపునాయునిపల్లెలో రిలే దీక్షలు ప్రారంభిం చారు. బద్వేలులో వివిధ మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు నిర్వహించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల నిరాహార దీక్షలు నిర్వహించారు. విశాఖ జిల్లా పాడేరులోని అంబేద్కర్ సెంటర్‌లో రిలే దీక్షలు చేశారు.
బెంగళూరులో ధర్నా: ఉద్యాన నగరి బెంగళూరులో వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు కాంగ్రెస్, సీబీఐ వైఖరిని నిరసిస్తూ బుధవారం పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. టౌన్‌హాలు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరం నలుమూల నుంచి భారీ సంఖ్యలో జగన్ అభిమానులు హాజరయ్యారు. కాంగ్రెస్, సీబీఐలకు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాలు ఆ ప్రాంతమంతటా మార్మోగాయి. కర్ణాటక డాక్టర్ వైఎస్‌ఆర్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో చిన్న,పెద్ద తేడా లేకుండా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మొదలుకుని, రోజువారీ కూలీలు సైతం పాల్గొన్నారు.
No comments:
Post a Comment