*రెండో చార్జిషీట్‌ను తొలి చార్జిషీట్‌కు కలుపుతామన్న న్యాయమూర్తి *అభ్యంతరం తెలిపిన సీబీఐ... ఒకో చార్జిషీట్‌నూ ప్రత్యేక కేసుగా పరిగణించాలని ఒత్తిడి *దీంతో రెండు, మూడో చార్జిషీట్లను వేర్వేరు కేసులుగా స్వీకరించిన కోర్టు *జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు రాకుండా ఉండేందుకు మహా కుట్ర *బెయిలు వచ్చినా మళ్లీ అరెస్టు చేయటానికి చార్జిషీట్ల సాగతీత *న్యాయప్రక్రియను అపహాస్యం చేస్తున్న సీబీఐ దర్యాప్తు * జగన్‌మోహన్‌రెడ్డే లక్ష్యంగా నిబంధనలకు, విలువలకు పాతర *మాజీ బాసు డెరైక్షన్‌లో చెలరేగిపోతున్న దర్యాప్తు సంస్థ
కరణం కిషోర్‌కుమార్ బహుశా.. దేశంలో మరే ఇతర కేసులోనూ సీబీఐ ఇంత అన్యాయంగా వ్యవహరించలేదేమో! న్యాయమూర్తి నిర్ణయాలకు సైతం అభ్యంతరాలు చెబుతూ.. న్యాయ ప్రక్రియలోనూ జోక్యం చేసుకుంటూ.. ఒక వ్యక్తిని టార్గెట్ చేయటానికి ఇంతలా బరితెగించిన తీరు మరే కేసులోనూ కనపడదేమో!! ఒక కేసులో ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాక.. అదే ఎఫ్‌ఐఆర్‌ను దర్యాప్తు చేస్తూ.. ఆ దర్యాప్తులో తేలిన అంశాలను మాత్రం ముక్కలు ముక్కల కింద విడగొట్టి.. వాటిని రకరకాల చార్జిషీట్లుగా వండి వారుస్తూ.. ఒక్కో చార్జిషీటునూ ఒకో ప్రత్యేక కేసుగా పరిగణించిన సందర్భం ఈ దేశ న్యాయ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరిగి ఉండదు. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ మటుకు.. ఎవరి ఆదేశాలు అమలు చేయటానికో, ఎవరిని సంతృప్తి పరచటానికో గానీ, అచ్చంగా ఇదే తీరులో వ్యవహరిస్తోంది. ఒకే ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఇప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. పెపైచ్చు, ఇంకెన్ని చార్జిషీట్లు వేస్తారని విలేకరులు అడిగితే.. ‘‘ఇంకా చాలా వేస్తాం. గుజరాత్‌లో ఒక కేసులో వంద చార్జిషీట్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేం అంతకన్నా తక్కువే వేస్తాం లెండి’’ అని సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ బదులిచ్చారు! దాన్ని బట్టి, సీబీఐ తానేం చేయబోతున్నదీ చెప్పకనే చెబుతోంది.
ఒక్కొక్కటీ ఒక్కో ప్రత్యేక కేసా? ఈ కేసులో సీబీఐ ఇప్పటికి మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. మూడింట్లోనూ తొలి నిందితుడిగా జగన్, రెండో నిందితుడిగా ఆడిటర్ విజయసాయిరెడ్డిలను పేర్కొంది. ఈ చార్జిషీట్లలో రెండింటిని ఇప్పటికే విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. రెండింటినీ రెండు కేసులుగా నమోదు చేసింది. వీటి విచారణ నిమిత్తం జూన్ 11న హాజరు కావాలని జగన్‌కు సమన్లు జారీ చేసింది. బుధవారం మూడో చార్జిషీటును కూడా విచారణకు స్వీకరించింది. దాన్ని కూడా ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ జూన్ 11న విచారణ హాజరు కావాలని జగన్‌కు సమన్లు జారీ చేసింది. అంటే, మూడు చార్జిషీట్లకు సంబంధించి, మూడు కేసుల్లోనూ ఒకే తేదీన జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందన్న మాట!
తొలి చార్జిషీటుతో రెండోదాన్ని కలిపిన జడ్జి మార్చి 31న తొలి చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ.. తరవాత రెండో చార్జిషీటునూ దాఖలు చేసింది. మే 16న రెండో చార్జిషీటును న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. దాన్ని తొలి చార్జిషీటుతో జత చేస్తున్నట్టు ఆ సందర్భంగా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘ఫైలును స్వీకరించాం. ఒరిజినల్ చార్జిషీటుకు ఇప్పటికే కేసు నంబరు 8/12 వచ్చింది. ఈ రెండో చార్జిషీటును కూడా దాంతో కలిపి విచారిస్తాం’’ (టేకెన్ ఆన్ ఫైల్. కాల్ దిస్ సెకండ్ చార్జిషీట్ అలాంగ్ విత్ ఒరిజినల్ చార్జ్‌షీట్ విచ్ ఈజ్ నంబర్డ్ యాజ్ సీసీ నంబర్ 8/12) అని న్యాయమూర్తి దానిపై స్పష్టంగా రాశారు.
చిత్రమేమిటంటే, న్యాయమూర్తి నిర్ణయమంటే ఒకరకంగా ఉత్తర్వు లాంటిదే. ఏ కేసులోనైనా ఆయన నిర్ణయమే ఫైనల్. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే అప్పీలు చేయటం, లేదా వేరే కోర్టులో సవాలు చేయటం వంటివి ఉంటాయి. అలాంటప్పుడు ప్రతివాదులకు కూడా దాన్ని సవాలు చేసే అవకాశం వస్తుంది. కానీ ఇక్కడే సీబీఐ ఏకపక్షంగా వ్యవహరించింది. న్యాయమూర్తి అభ్యంతరాలపై మెమో దాఖలు చేసింది. కనీసం ప్రతివాదులకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా, వీటిని వేర్వేరు కేసులుగా పరిగణించాలని కోర్టును కోరింది.
దాంతో కేసు రెండో చార్జిషీటును మొదటి దాన్నుంచి విడదీసి, ప్రత్యేక కేసుగా కోర్టు గుర్తించింది. మే 29న మంగళవారం దానికి కేసు నంబరు 9/29 కేటాయించింది. అందుకు వీలుగా న్యాయమూర్తి ఉత్తర్వులిస్తూ ‘‘వీటిలో లావాదేవీలు వేరు. సాక్షులు వేరు. అందుకే రెండో చార్జిషీట్‌ను వేరుగా పరిగణిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. గతంలో సీబీఐ దాఖలు చేసిన మూడో చార్జిషీట్‌ను సాంకేతిక కారణాల దృష్ట్యా కోర్టు తిప్పి పంపటం తెలిసిందే. దాన్ని సరిచేసి మంగళవారం మళ్లీ కోర్టుకు సమర్పించిన సీబీఐ.. దాన్ని కూడా వేరే కేసుగా స్వీకరించాలంటూ ఒత్తిడి తెచ్చింది. దాంతో ఆ మేరకు కోర్టు బుధవారం నిర్ణయం వెలువరించింది. దాన్ని ప్రత్యేక కేసుగా విచారణకు స్వీకరిస్తూ.. జగన్, ఆయనతో పాటు ఇతర నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, ఎ.అయోధ్యరామిరెడ్డి, జి.వెంకటరామిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, రాంకీ ఫార్మాసిటీలకు సమన్లు జారీ చేసింది. వారు జూన్ 11న హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.
జగన్‌ను వేధించటమే ధ్యేయం!! ఇలా ఒక్కో చార్జిషీటును ఒకో కేసుగా పరిగణించాలని సీబీఐ కోరడం వెనక భారీ కుట్రే దాగి ఉంది. ఎందుకంటే తొలి చార్జిషీట్‌ను మార్చి 31న సీబీఐ దాఖలు చేయటంతోనే ఈ కేసులో దర్యాప్తు ముగిసినట్టు లెక్క. దర్యాప్తు ముగిశాక నిందితుల్ని అరెస్టు చేయటమనేది బలమైన కారణాలుంటే తప్ప కష్టం. పెపైచ్చు దర్యాప్తు ముగిశాక నిందితులకు సహజంగానే బెయిలు లభిస్తూ ఉంటుంది. పైగా దర్యాప్తు ముగిశాక సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశమో, సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశమో ఉండదు గనుక బెయిలును అడ్డుకోవటం కూడా సీబీఐకి కష్టం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న సీబీఐ.. జగన్ బెయిల్‌పై విడుదలవకుండా సాధ్యమైనంత ఎక్కువ కాలం అడ్డుకోవాలంటే ఇలా ప్రత్యేక చార్జిషీట్లు వేసి, కోర్టు ద్వారా వాటన్నిటినీ వేర్వేరు కేసులుగా పరిగణింపజేయటమే మార్గమని భావించింది.
ఫలితంగా జగన్‌కు బెయిలు వచ్చినా, మరో కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారంటూ దాన్ని అడ్డుకోవచ్చు. అక్కడా బెయిలొస్తే వేరొక కేసు చూపించి అడ్డుకోవచ్చు. ఒకవేళ చార్జిషీట్లు దాఖలు చేసిన అన్ని కేసుల్లోనూ బెయిలొచ్చినా, చార్జిషీట్లు దాఖలు చేయని కేసుల్ని ప్రస్తావించి, వాటిలో ఇంకా దర్యాప్తు జరుగుతోందని చెప్పి మళ్లీ అరెస్టు చేయవచ్చు. పెపైచ్చు వాటి దర్యాప్తు కోసమంటూ కావాల్సినన్ని సార్లు, కావాలనుకున్నన్ని సార్లు పిలిచి మరీ వేధించొచ్చు! ఇదీ సీబీఐ మహా కుట్ర.
అసలు భారీ ప్రజాదరణ ఉన్న ఒక నాయకుడిని, ఒక రాజకీయ పార్టీ అధినేతను సీబీఐ ఇంతలా వేధించాలనుకోవటానికి కారణమేంటి? ఏ కేసులోనైనా దర్యాప్తును దర్యాప్తులా తీసుకోవాలి గానీ, నేరుగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ సీబీఐ ఎందుకింతలా దిగజారిపోవాలి? ఇదంతా ఎవరి ఆదేశాల మేరకు జరుగుతోంది? సీబీఐని డెరైక్ట్ చేస్తున్న ఆ మాజీ బాసులెవరు? వారికిలా డెరైక్ట్ చేయాల్సిన అవసరమేంటి? అసలు సీబీఐ పని చేస్తున్నది ఎవరి ప్రయోజనాల కోసం? ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తేలిగ్గానే అర్థమవుతున్నా... నిజానిజాలు నిక్కచ్చిగా తేలాలంటే మాత్రం సీబీఐ బాసులు నోరు విప్పాల్సిందే!!
సీబీఐది ముమ్మాటికీ తప్పే.. సీబీఐ చేస్తున్నది ముమ్మాటికీ తప్పే. అది తనకున్న అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ న్యాయప్రక్రియలో కూడా జోక్యం చేసుకుంటోంది. ఏ కేసులోనైనా వేర్వేరు చార్జిషీట్లు దాఖలు చేయాలంటే ఎఫ్‌ఐఆర్‌లు కూడా వేర్వేరుగానే ఉండాలి. ఒకే ఎఫ్‌ఐఆర్‌పై ఇలా వేర్వేరు చార్జిషీట్లు వేస్తామంటే కుదరదు. ఒకవేళ అనుబంధ (సప్లిమెంటరీ) చార్జిషీట్ వేయాలనుకున్నా సంవత్సరానికి ఒకటి మాత్రమే వేయాల్సి ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యమేమిటంటే, ఒకే కేసులో వేసిన వేర్వేరు చార్జిషీట్లకు వేర్వేరు నంబర్లు కేటాయించ కూడదు. - శివరామకృష్ణ, సీబీఐ మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ |
No comments:
Post a Comment