కాంగ్రెస్, టీడీపీల తీరుపై వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని జైల్లో పెట్టి కాంగ్రెస్, టీడీపీ ఆడుతున్న వింతనాటకానికి రాష్ట్ర ప్రజలు త్వరలోనే తెరదించబోతున్నారని హెచ్చరించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరికీ కూడా ప్రజలెవరూ తమ సమస్యలు చెప్పుకోవడం లేదన్నారు. ప్రజలు తమ బాధలను, కష్టాలను షర్మిలకే చెబుతున్నారని చెప్పారు.
అధికారంలోకి వచ్చే అవకాశంలేని ఆ ఇద్దరి మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు పాదయాత్ర ఉత్తరాంధ్రకు వెళ్లేసరికి టీడీపీ నేతలంతా వైఎస్‌ఆర్ సీపీలో చేరడం ఖాయం అన్నారు. షర్మిల పాదయాత్రను అపహాస్యంను చేస్తే ప్రజలు చీదరించుకుంటారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కార్యాలయాలకు త్వరలోనే టూలెట్ బోర్డులు పెడతారన్నారు.
వైఎస్ జగన్మోహన రెడ్డి జైల్లో సెల్‌ఫోన్ వాడుతున్నారంటున్న టీడీపీ నేతలు ఎవరైనా సరే భారతి ఛాలెంజ్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ సీపీలోకి వచ్చే నేతలను ఆపుకోవడం చేతకాక టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.

No comments:
Post a Comment