వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నేతలు తోపుదుర్తి కవిత, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ, ఎల్ ఎమ్ మోహన్ రెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర... మరో ప్రజా ప్రభంజనం అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు వేలాదిమంది స్వచ్చందంగా తరలి వస్తున్నారన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి పదవులు ఎక్కువగా ఇవ్వటానికి జగన్ ప్రభంజనమే కారణమన్నారు. జైపాల్ రెడ్డికి శాఖ మార్చటం అప్రజాస్వామికమని మేకపాటి వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment