దరాబాద్, న్యూస్‌లైన్: హెరిటేజ్ పార్లర్‌లో కొనుగోలు చేసిన మిఠాయి బూజు పట్టిఉండడంతో వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు. హైదరాబాద్‌లోని రాజరాజేశ్వరీనగర్‌కు చెందిన కిషన్‌సింగ్ ఆదివారం సాయంత్రం బల్కంపేట్‌లోని హెరిటేజ్ పార్లర్‌లో 200 గ్రాముల దూద్‌పేడను కొనుగోలు చేశారు. ప్యాకెట్‌పై తయారీ తేదీ ఈ నెల 22 అని, పది రోజుల్లోగా వాడాలని ముద్రించి ఉంది. ఇంటికి వెళ్లి ప్యాకెట్‌ను తెరిచి చూడగా లోపల మిఠాయి బూజు పట్టి ఉంది. దీంతో ఆయన ఆగ్రహంతో దూద్‌పేడను తిరిగి పార్లర్‌కు తీసుకువచ్చి నిర్వాహకుడు ప్రకాశ్‌ను నిలదీశారు. అవి కంపెనీ నుంచి నేరుగా తమకు వస్తాయని ఆయన సర్దిచెప్పి, హెరిటేజ్ సంస్థ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ప్రకాశ్ వాపోయాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment