అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా సోమవారం ఎస్కేయూ వద్ద నుంచి ఆకుతోటపల్లి, అనంతపురం నగర పరిధిలోని లేపాక్షినగర్, పంగల్‌రోడ్డు, ఆర్డీటీ ఆసుపత్రి, ప్రజావైద్యశాల, విజయనగరకాలనీ, కలెక్టరేట్, పవర్ ఆఫీసు, విజయక్లాత్ స్టోర్ సర్కిల్, ఐరన్ బ్రిడ్జి, సప్తగిరి సర్కిల్, వైఎస్సార్ సర్కిల్, సుభాష్‌రోడ్డు, క్లాక్‌టవర్, ఓవర్‌బ్రిడ్జి, నడిమివంక, కళ్యాణదుర్గం బైపాస్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ ప్రోగామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు. సోమవారం 11.2 కిలోమీటర్ల మేర షర్మిల నడుస్తారని చెప్పారు. నగరంలోన సప్తగిరి సర్కిల్ బహిరంగసభలో షర్మిల ప్రసంగిస్తారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment