విశాఖ జిల్లా పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో అదికారికంగా చేరారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం అదినేత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు కూడా టిడిపిని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం మంచిదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలను జనం నమ్మడం లేదని, అందుకే తాను ఆ పార్టీని వీడి బయటకు వచ్చానని అన్నారు. వై.ఎస్.జగన్ ను కాంగ్రెస్,టిడిపిలు కలిసి ఎంత అణచాలని చూస్తే అంతకన్నా ఎక్కువగా ఆయన పైకి వస్తారని, జనం అంతా జగన్ ను సి.ఎమ్. ను చేయాలని భావిస్తున్నారని చెంగల చెప్పారు. పది సంవత్సరాలపాటు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకటరావు ఇప్పుడు ఏకంగా టిడిపిని కాంగ్రెస్ లో కలపమనడం ఆశ్చర్యంగానే ఉంటుంది.తాను ప్రస్తుత ఎమ్మెల్యే బాబూరావుతో కలిసి పనిచేస్తానని, ఆ తర్వాత పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20121029_5.php
http://kommineni.info/articles/dailyarticles/content_20121029_5.php
No comments:
Post a Comment