హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలకు గట్టి షాక్ తగిలింది. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. రాజేష్ కుమార్ సోమవారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి రాజేష్ కుమార్ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మరోవైపు గత ఎన్నికల్లో రాజేష్ కుమార్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావు కూడా వచ్చే నెల 4న కొవ్వూరు బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అలాగే పాయకరావుపేట మాజీ టీడీపీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

No comments:
Post a Comment