పులివెందుల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ తన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందుల జిల్లాపరిషత్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయమ్మ విద్యార్థినిలకు భోజన ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. ఇదే పాఠశాలలో 8, 9, 10 తరగతులు చదువుకున్న విజయమ్మ...కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా విద్యార్థులంతా బాగా చదివి పైకి రావాలని పిల్లల్లో స్ఫూర్తి నింపారు. ప్రతి విద్యార్థిని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కృషి చేయాలని కోరారు. అనంతరం వేంపల్లె మండలంలోని కుమ్మరాంపల్లె ప్రాధమిక పాఠశాలను సందర్శించిన విజయమ్మ ఆ పాఠశాల అదనపు నూతన తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడిన విజయమ్మ విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించాలని కోరారు.
source: sakshi
source: sakshi





No comments:
Post a Comment