కాంగ్రెస్‌ను బతికించుకుందామంటూ ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు నిర్వహించిన మేథోమథనానికి పార్టీ నేతల నుంచే స్పదన కరువైంది. శనివారం జూబ్లీహాలులో పార్టీని బలోపేతం చేయడంపై వీహెచ్ ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఒకరిద్దరు నేతలు మినహా ప్రజా ప్రతినిధులెవరూ హాజరుకాలేదు. తన మద్దతుదారులతోనే ఆయన మేథోమథనాన్ని కొనసాగిస్తున్నారు.
పార్టీ వరుసగా ఎందుకు ఓడిపోతోందనే దానిపై చర్చ జరగాలన్న తన సూచనను పీసీసీ పట్టించుకోకపోయినప్పటికీ తానే చొరవ తీసుకుని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వీహెచ్ తెలిపారు. నామినేటెడ్ పదవులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా ఈ సదస్సులో పాల్గొన్న మాజీ మంత్రి చిన్నారెడ్డి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనన్నారు. అవినీతి ఆరోపణలపై యూపీయే సర్కారు ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు. రాష్ట్రంలోనూ గడ్డు పరిస్థితులే ఉన్నాయన్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం అంశం, సీమాంధ్రలో జగన్ ప్రభంజనంతో కుదేలైన కాంగ్రెస్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు యువ కాంగ్రెస్ నేతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment