YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 5 September 2012

9న వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సమావేశం

వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న(ఆదివారం) హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్‌ఫేర్ ఉద్యోగుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ విభాగం అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనియన్ నిర్మాణం, కార్యాచరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల వేతన సవరణ, ఔట్‌సోర్సింగ్ విధానం రద్దుతోపాటు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని, దీనికి యూనియన్ ముఖ్యనేతలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!