గుంటూరు, న్యూస్‌లైన్:
మహానేత వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని వేరు చేసి చూపించి ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. వైఎస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ పేరిట ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చేసిన హడావుడి ప్రజలను మభ్యపెట్టేందుకేనని ఆయన విమర్శించారు. గుంటూరులో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహానేత పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, క్రిమినల్‌గా చిత్రీకరించినప్పుడు ఆ నేతలు ఎందుకు మౌనం దాల్చారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలు కష్టపడ్డ వైఎస్సార్ కుటుంబాన్ని వేధిస్తున్న వారే ఆయన పాలనను ఆహా.. ఓహో అని ప్రశంసించారన్నారు. భారీ ప్రజాదరణ గలిగిన వైఎస్ కుమారుడు జగన్‌ను జైలుకు పంపినప్పుడు ఈ నేతలంతా ఏమయ్యారని ప్రశ్నిం చారు.
మహానేత కుటుంబాన్ని క్షోభకు గురిచేస్తున్న ఈ నేతలకు వైఎస్‌ను తమవాడని చెప్పుకొనే నైతిక హక్కు లేదన్నారు. త్వరలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ విలీనమవుతున్నట్లు వస్తున్న వదంతుల దుమారాన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధం గా లేరని అన్నారు. ఇవన్నీ రాష్ర్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేందుకు వైరి పార్టీల ప్రయోగాలంటూ కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇంకా అధికారదాహం తీరలేదని, పాదయాత్రలు, సైకిల్ షోలు వంటి జిమ్మిక్కులతో ఆయనకు అధికారం దక్కడం కల్లేనని జోస్యం చెప్పారు. పాదయా త్ర చేసిన అందరూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేరని ఎద్దేవా చేశారు. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిన బాబు, ప్రస్తుతం ఉనికి పోరాటంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. పాదయాత్రలో ప్రజలు ఆయన్ను ఛీ కొట్టడం ఖాయమన్నారు.
No comments:
Post a Comment