హైదరాబాద్, సెప్టెంబర్ 7 : తమ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాబోదని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలను విజయలక్ష్మి తోసిపుచ్చలేదంటూ పీటీఐ ఒక వార్తా కథనాన్ని ప్రచురించటం అత్యంత హేయమైన చర్యగా వైసీపీ అభివర్ణించింది.
విజయలక్ష్మి ఏమన్నారో..యథాతథంగా ప్రచురిస్తే అభ్యంతరంలేదని, దానికి పీటీఐ తనకు నచ్చిన భాష్యం చెప్పటం కుట్రపూరితమైన వ్యవహారమని పార్టీ కార్యాలయం శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తమ పార్టీ మరే పార్టీతోనూ, ఏ నాటికీ విలీనం అయ్యే ప్రశ్నే తలెత్తదని, అయినా కుట్రపూరితమైన కథనాలను ఎందుకు ప్రచురించిందో పీటీఐ సమీక్షించుకోవాలని కోరింది. తక్షణం ఆ కథనాన్ని వెనక్కు తీసుకోవాలని, దుష్ప్రచారాన్ని ఆపాలని పార్టీ డిమాండ్ చేసింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

No comments:
Post a Comment