వాషింగ్టన్ డీసీ: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి భౌతికంగా లేకున్నా ఆయన ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఎన్నారై వల్లూరు రమేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహానేత మూడో వర్థంతి సభను సెప్టెంబర్ 21వ తేదిన వర్జీనియాలోని ఫ్రయింగ్ పాన్ ఫోరం పార్క్ ఆడిటోరియంలో జరుపుతున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ భూమానాగిరెడ్డి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారని రమేష్ రెడ్డి వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment