YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 7 September 2012

అన్నీ తానై పార్టీ బరువు బాధ్యతలను భూజాన (surya news)

DSC_0796హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌:రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరా డటంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాటుదేలుతోంది. పార్టీ అధినేత జగన్‌ లేని కొరతను పార్టీ వర్గాలపైన, కార్య కర్తలు, అభిమానులపైన పడనీయకుండా పార్టీ గౌరవా ద్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అన్నీ తానై పార్టీ బరువు బాధ్యతలను భూజాన వేసుకు న్నారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలిచి ప్రభు త్వంపై పోరాటాలకు కొంగు బిగించారు. మూడేళ్ళ కిందటి దాక గుమ్మం దాటి బైటకురాని విజయమ్మ ను రాష్ట్రంలో నెలకున్న ప్రత్యే క పరిస్థితులే బయటకు వచ్చేలా చేశాయి. అంతే కాదు నడుస్తున్న రాజకీయాల్లో ఆమెను మంచి వక్తగానే కాకుండా సమర్ధత గల నేతగా ఏదిగేందుకు దోహద పడుతున్నాయి. 

రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటివరకూ చరిష్మా ఉన్న మహిళానేతగా రాష్టస్థ్రాయిలో ఎవరూ లేరన్న లోటును భర్తీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పేద విద్యార్దులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చేస్తున్న కుదింపు ప్రయత్నాలను ఎండగడుతూ విజయమ్మ రెండురోజుల ఫీజుదీక్ష విజయవంతంగా మగియటం పార్టీ వర్గాల్లో ఉత్సాహం నింపింది. రాజధాని నడిబొడ్డున చేపట్టిన ఈ దీక్షకు విద్యార్ది వర్గాలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి విజయమ్మ డిమాండ్లకు గళం కలిపాయి. ఇతర వర్గాల ప్రజలు కూడా దీక్షా స్థ్ధలానికి చేరుకుని ప్రభుత్వంపై ఫీజుపోరుకు బాసటగా నిలిచాయి. అంతకు ముందు కూడా ఇదే అంశంపై విజయమ్మ ఏలూరు కేంద్రంగా చేసుకుని రెండురోజుల పాటు చేసిన దీక్ష విజయవంతం కావటం పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపింది. 

గత నెల 14, 15తేదీల్లో విజయమ్మ చేపట్టిన ఫీజురీఎంబర్స్‌మెంట్‌ దీక్ష అన్ని వర్గాల విద్యార్దులను అకర్షించమే కాకుండా ప్రభుత్వ విధానాలపై ఆలోచింప చేసింది.‘ వైఎస్‌ పైనుంచి ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే చాల బాధ పడుతుంటారు’ అంటూ విజయమ్మ గద్గద స్వరంతో కంటతడిపెట్టడం వంటి దృశ్యాలు సాధారణ ప్రజానీకాన్ని సైతం చలింపచేశాయంటున్నారు. రాష్ట్రంలో ఎవరూ సుఖంగా లేరని తన మాటలతో విజయమ్మ రాష్ట్ర పరిస్థితులను కళ్ళకు కట్టారు. తెలుగుదేశం పార్టీ వెనుకబడిన తరగతులకు వంద టిక్కెట్లు వచ్చే ఎన్నికల్లో ఇవ్వనుందని ప్రకటించడం పట్ల వైఎస్‌ఆర ్‌కాంగ్రెస్‌ పార్టీ అంతకు మించిన స్థాయిలోనే స్పందించింది. బీసీలకు ఎన్నికల్లో వంద టిక్కెట్లు కాదు శాసనసభలోనే వంద స్దానాలు కేటాయిద్దాం అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విజయమ్మ లేఖరాసి కొత్త ప్రతిపాదనలకు తెరలేపింది. 

విజయమ్మ ప్రతిపాదన పట్ల బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. బీసి సంఘాల రాష్ట్ర నేత ఆర్‌ కృష్ణయ్య సైతం విజయమ్మ చేసిన ప్రతిపాదన చారిత్రాత్మక ప్రతిపాదన అంటూ హర్షించారు. సహజంగానే ఈ ప్రతిపాదనతో విజయమ్మ పార్టీని బీసి వర్గాలకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేసింది. గత నెల చివరివారంలో గడపగడపకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అన్న నినాదంతో విజయమ్మ రంగారెడ్డిజిల్లాల్లో నేరుగా జనంలోకి వెళ్ళారు. వైఎస్‌ మీ ముందుకొస్తే ..ఆయన కళ్ళలోకి సూటిగా చూడగలరా! అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతల గుండేల్లో రైళ్ళు పరిగెత్తించారు. మొన్నటిదాక విద్యుత్‌ కోతలతో విసిగెత్తిపోతున్న ప్రజలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తనే ధర్నాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర బంద్‌ పిలుపుతో పార్టీ శ్రేణుల్లో చురుకు పుట్టించారు.

మరిన్ని ఉద్యమాలకు వ్యూహం
పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుండంతో పార్టీ ముఖ్యనేతలు ఇక విజయాస్త్రానికి మరింత పదును పెట్టాలన్నన అభిప్రాయంతో ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉద్యమాలకు వ్యూహరచన చేయనున్నట్టు పార్టీ సీనియర్‌ నాయకులొకరు పేర్కొన్నారు. జిల్లాల వారీగా స్దానిక సమస్యలపై కూడా ఉద్యమాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. జగన్‌ జైలునుంచి బయటకు వచ్చేలోపు పార్టీని కాపాడు కోనుకునేందు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నింటిని ఉపయోగించుకునే అలోచనలో ఉన్నారు. సమస్యల ఆధారంగా ఒక వైపు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే మరోవైపు ప్రతిపక్షస్దానంలో ఉన్న తెలుగుదేశం పార్టీని వెనక్కు నెట్టి ఆ స్ధానంలో ఎదిగేందుకు ద్విముఖ వ్యూహం అమలు చేస్తూ పార్టీని పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగే యోచనలో ఉన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!