ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, ఆళ్ల నాని తెలిపారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తేకాని ప్రభుత్వంలో కదలిక రాలేదన్నారు. ఇప్పటికైనా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని వారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ సీపీదే విజయం అని వారు ధీమా వ్యక్తం చేశారు.
జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థలకు త్వరలో జరగబోయే ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజుతోపాటు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు, కేంద్ర పాలకమండలి సభ్యులు కొయ్యె మోహన్ రాజు, జిల్లా పరిశీలకులు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అల్లు సత్యనారాయణ, పూనం సింగన్న దొర తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment