తిరుపతి : కరెంట్ కోతలకు నిరసనగా తిరుపతిలో నిరసన తెలుపుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా జీపుల్లోకి ఈడ్చిపడేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
బంద్‌ను అణచడానికి ప్రభుత్వం కర్కశంగా వ్యవహారిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల కష్టాలను, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా పోలీసులను ప్రయోగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు.

No comments:
Post a Comment