కరెంట్ కోతలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ శుక్రవారం ప్రశాంతంగా జరిగిందని పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. ఆమె పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడుతూ బంద్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టు అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంట్ కోతలతో జనం విసిగిపోయి ఉన్నారని, అందుకే బంద్ లో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఆమె స్పష్టం చేశారు. ఫలితంగా రాష్ట్ర బంద్ విజయవంతమైందని చెప్పారు. పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న బంద్ రాజకీయ లబ్ది కోసం కాదని, ప్రజలకు మేలు చేకూర్చే లక్ష్యంతోనే చేశామని శోభానాగిరెడ్డి చెప్పారు. బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments:
Post a Comment