ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ కు సంఘీభావంగా ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్చందంగా మూసివేశాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, మండలాల్లో వర్తక, వాణిజ్య సముదాయాలను మూతపడ్డాయి. పలుచోట్ల డిపోల ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయూబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
భద్రాచలంలో 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలో పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు ఎడవల్లి కృష్ణ, మచ్చ శ్రీను, ఎర్రంశెట్టి ముత్తయ్య సహా 200మందిని అరెస్ట్ చేశారు.

No comments:
Post a Comment