విద్యుత్ సంక్షోభంపై సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం.. జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది. పోలీసులు గురువారం రాత్రి నుంచే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. బంద్‌లో కనిపిస్తే నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని పార్టీ శ్రేణులను బెదిరింపులకు గురిచేస్తున్నారు.
గుంటూరు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది నాయకులు, కార్యకర్తలను గురువారం రాత్రి 11.15 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెంటు కోతలకు నిరసనగా స్వచ్ఛందంగా బంద్ పాటించటానికి సిద్ధమయిన వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు కూడా ఫోన్లు చేసి.. బంద్ చేయవద్దని చెప్తున్నారు.

No comments:
Post a Comment