వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ విజయవంతమైనా రాష్ట్రంలోని కొన్ని టీవీ చానళ్లు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యుటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో బంద్ జరగనేలేదని టీవీ 9 వంటి చానళ్లు ప్రత్యేక బులిటిన్స్ ప్రసారం చేశాయన్నారు.
నాడు ఓదార్పు యాత్ర విషయంలోనూ ఇలాగే కొన్ని చానళ్లు వ్యతిరేక కథనాలు ప్రసారం చేశాయని ఆమె విమర్శించారు. కరెంట్ సమస్య తీవ్రంగా ఉన్న విషయంపై ప్రత్యేక వార్తా కథనాలు ప్రసారం చేసిన ఆ చానళ్లు నేడు ఇలాంటి వార్తలు ఎందుకిస్తున్నాయని సూటిగా ప్రశ్నించారు. దయచేసి ఇలాంటి వార్తలు మానుకుని వాస్తవాలను ప్రసారం చేయాలని ఆమె హితవు పలికారు.

No comments:
Post a Comment