విద్యుత్ కోతలకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన బంద్‌కు అన్నివర్గాల మద్దతు లభిస్తోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డిపద్మ తెలిపారు. బంద్ దృష్ట్యా దూరప్రాంతాలకు ప్రయాణాలు వాయిదావేసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, ఆటోలు, వాణిజ్యసంస్థలు బంద్ పాటించాలని పద్మ సూచించారు. పెట్రోల్ బంక్‌లు, బ్యాంక్‌లు, ప్రభుత్వ ఆఫీస్‌లు కూడా బంద్లో పాల్గొనాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. అయితే అత్యవసర సర్వీసులకు ఎలాంటి ఆటంకాలుండవని వాసిరెడ్డి పద్మ తెలిపారు. బంద్‌కు అన్నివర్గాలు సహకరించాలని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment