తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐకి సుప్రీంకోర్టు వారం రోజులు గడువిచ్చింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు అనుమతివ్వాలంటూ సీబీఐ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సుప్రీం కోర్టు అంగీకరించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత బెయిల్ పిటిషన్ తిరిగి విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment