విద్యుత్ కోతలకు నిరసనగా హైదరాబాద్‌లో శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన మైనార్టీలపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ హెచ్ ఏ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా ర్యాలీ చేస్తున్నవారిని అడ్డుకుని వారి వాహనాల తాళాలను పోలీసులు లాక్కున్నారు.
వందలాది మంది కార్యకర్తలను, మైనార్టీ నేతలను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు మెహదీపట్నం నుంచి సెక్రటేరియేట్ వైపు వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీని రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు విచరణరహితంగా కొట్టారు.

No comments:
Post a Comment