ఎన్.డి.టి.వి సర్వే పై ఆ చానల్ లో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కి, వై.ఎస్.జగప్మోహన్ రెడ్డి సతీమణి భారతిల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.కాంగ్రెస్ పార్టీకి ఇంకా పద్దెనిమిది నెలల సమయం ఉందని, అందువల్ల ప్రజలలో ఆదరణ పెంచుకోవడానికి తమ అస్త్రాలు తమకు ఉన్నాయని మొయిలీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలుస్తుందా అనేది ఇప్పుడే చెప్పజాలనని ఆయన అన్నారు. వీరప్ప వ్యాఖ్యలపై భారతి స్పందిస్తూ కాంగ్రెస్ అస్త్రాలలో సిబిఐ కూడా ఒకటి అని వ్యాఖ్యానించారు. భారతి సమయస్పూర్తిగా వ్యాఖ్యానించారని భావించవచ్చు. సిబిఐని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ జగన్ ను వేధిస్తున్నదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.జగన్ ఇంకా తెలంగాణలో తిరగలేదని, అక్కడ కూడా పర్యటించాక ఆదరణ పెరుగుతుందని భారతి అన్నారు. కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తి లేదని భారతి పేర్కొన్నారు. మొత్తం మీద చర్చలలో సమయ స్పూర్తి, ఎదుటివారి అభిప్రాయాలను కౌంటర్ చేయడంలో నేర్పు ఉండాలి. రాజకీయాలకు కొత్త అయినా భారతి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగానే ఉంది.ఆమె సమాధానం టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఉందని చెప్పవచ్చు.
http://kommineni.info/articles/dailyarticles/content_20120828_3.php#.UDxIz5q1xug.wordpress
http://kommineni.info/articles/dailyarticles/content_20120828_3.php#.UDxIz5q1xug.wordpress
No comments:
Post a Comment